బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతున్న ఉద్యోగులు
మెదక్ కలెక్టరేట్: నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం సమగ్ర శిక్షా ఉద్యోగులు సీఎం రేవంత్‌రెడ్డి కటౌట్ వద్ద బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. మీ సోదరీమణులుగా భావించి మా సమస్యలు పరిష్కరించాలని, మా జీవితాలలో వెలుగులు నింపాలని వేడుకున్నారు. అనంతరం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 400 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment