బైపాస్ రోడ్డుతో ట్రాఫిక్‌కు చెక్
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణ అభివృద్ధితో పాటు ట్రాఫిక్ సమస్యల నివారణ, చుట్టు పక్కల మండలాల్లోని జనాలకు మేలు చేకూర్చేందుకు బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్ శివారులోని చాంద్‌ఖాన్‌పల్లి నుంచి కంగ్టి రోడ్డుకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలో జనాభా రోజు రోజుకు పెరుగుతున్నందున రానున్న రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పిస్తున్నామని వివరించారు. ఇప్పటికే కరస్‌గుత్తి రోడ్డు నుంచి కంగ్టి రోడ్డుకు బైపాస్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. చాంద్‌ఖాన్‌పల్లి నుంచి ఖాంజీపూర్ వరకు.. అక్కడి నుంచి జాతీయ రహ దారి వరకు లింక్‌రోడ్లను నిర్మిస్తామని చెప్పారు. ప్రజలు అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. అలాగే పట్టణంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment