పకడ్బందీగా సర్వే
అల్లాదుర్గం(మెదక్): పథకాల అమలు కోసం అధికారులు సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఆదేశించారు. ఆదివారం మండలంలోని చిల్వెర గ్రామంలో సర్వే తీరును పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. గ్రామాల వారీగా పూర్తయిన సర్వే వివరాలను గ్రామ సభలో ప్రకటించాలన్నారు. ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
రైతు భరోసాపై
అపోహలు వద్దు
నర్సాపూర్ రూరల్: సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందుతుందని జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ అన్నారు. ఆదివారం మండలంలోని అహ్మద్‌నగర్‌లో రైతుభరోసా సర్వేను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజమైన రైతులకే రైతు భరోసా పథకం అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సర్వే చేయిస్తుందన్నారు. రైతు భరోసాపై రైతులు ఎలాంటి అపోహలు పెట్టు కోవద్దన్నారు. జిల్లావ్యాప్తంగా సాగు యోగ్యం కాని భూముల సర్వే ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ మహేష్, మండల వ్యవసాయ అధికారి దీపిక, ఆర్‌ఐ సత్తుస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
ఏడుపాయల
టెండర్లు ఖరారు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయలలో ఆదివారం నిర్వహించిన బహిరంగ వేలంలో టెండర్లు ఖరారు అయ్యాయి. మాఘ అమావాస్య, శివరాత్రి జాతర కోసం తాత్కాలిక టెంట్లు, వంట సామగ్రి వేసేందుకు రూ. 4.60 లక్షల పాట పాడి టెండర్ దారులు హక్కు పొందినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు.
‘ప్రజా వ్యతిరేక విధానాలను
ఎండగడదాం’
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో ఆదివారం కార్మిక, కర్షక ఐక్య దినోత్సవాన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సదస్సు నిర్వహించా రు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చింతల గౌరయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, కర్షక ఐక్య దినోత్సవ సదస్సును నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటికే రైతు సంఘాలు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
21, 22న సదరం క్యాంపులు
మెదక్ కలెక్టరేట్: ఈనెల 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులను గుర్తించి ధృవీకరణ పత్రం పొందేందుకు అవకాశం ఉంటు ందని తెలిపారు. మొదటి రోజు దృష్టి లోపం, మూగ, వినికిడి లోపం, మానసిక ది వ్యాంగులకు, రెండోరోజు శారీరక దివ్యాంగుల గుర్తింపు కార్యక్రమం ఉంటుందని వివరించా రు. జిల్లా లోని అర్హులైన దివ్యాంగులు మీ సేవ, ఈ సేవ ద్వారా దరఖాస్తు చేసుకొని నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు.
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
మెదక్ కలెక్టరేట్: మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు 4 నెలల ఉచిత బేసిక్ ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి జెమ్లా నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్–1, 2, 3, 4 పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్దులు, జైనులు, పార్శికుల అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో ఫిబ్రవరి 15 లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. పూర్తి సమాచారం కోసం 040– 23236112 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment