ఘనపురం చేరిన సింగూరు జలాలు
పాపన్నపేట(మెదక్): మంజీరా పరవళ్లతో ఘనపురం ప్రాజెక్టు పొంగిపొర్లుతుంది. సింగూరు నుంచి ఈనెల 15న విడుదల చేసిన నీరు ఆదివారం తెల్లవారుజామున ఆనకట్టకు చేరింది. యాసంగి పంటకు మొదటి విడతగా 0.35 టీఎంసీల నీరు విడుదల చేయడంతో ఫతేనహర్, మహబూబ్ నహర్ కెనాల్ నుంచి ఇరిగేషన్ అధికారులు పొలాలకు నీటిని వదిలారు. దీంతో ఆనకట్ట కింద ఉన్న 21,625 ఎకరాల్లో రైతులు వరి నాట్లు ప్రారంభించారు. ఈ సీజన్‌కు సంబంధించి సుమారు 3 టీఎంసీల నీరు అవసరమవుతుందని భావిస్తున్నారు. మరో 7 విడతల్లో 0.35 టీఎంసీల చొప్పున అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ డీఈఈ శివనాగరాజు తెలిపారు. ఆనకట్ట పైనుంచి పొంగి పొర్లుతున్న నీరు దిగువకు ప్రవహిస్తుండటంతో కూచన్‌పల్లి సర్ధన వద్ద ఉన్న చెక్ డ్యాం నిండనుంది. అలాగే ఎల్లాపూర్ తీర ప్రాంతాలకు సాగునీరు అందనుంది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
నాగ్సాన్‌పల్లిలో వరి నాట్లు వేస్తున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment