పల్లెల్లో ‘లోకల్’ లొల్లి!
మెదక్ కలెక్టరేట్: పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా గుర్తులను సైతం ప్రకటించింది. బ్యాలెట్ ముద్రణకు జిల్లా స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి 50 శాతం బ్యాలెట్ పేపర్లు ముద్రించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్నికల సామగ్రిని జిల్లా కేంద్రానికి తరలించే ప్రక్రియ ప్రారంభం కాగా.. తుది ఓటరు జాబితా సైతం ప్రకటించారు. బ్యాలెట్ బాక్సుల పరిశీలన పూర్తయింది. ఇక రిజర్వేషన్, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది.
ఆశావహుల సందడి
సర్పంచ్ పదవికి పోటీ చేసే ఆలోచనలో ఉన్న ఆశావహులు ఇప్పటికే గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కొందరు రిజర్వేషన్, నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుండగా.. మరికొందరు ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభిస్తే ఖర్చులకు తట్టుకోలేమని స్తబ్దుగా ఉన్నారు.
ఎన్నికల గుర్తులివే..
సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రం సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, ఫుట్‌బాల్, బ్యాట్, బ్యాట్స్‌మెన్, స్టంప్స్, లేడీస్ పర్స్, టీవీ రిమోట్, టూత్ పేస్టు, పాన్, చెత్తడబ్బా, బెండకాయ, కొబ్బరిచెట్టు, వజ్రం, నల్లబోర్డు బకెట్, డోర్ హ్యండిల్, చేతికర్ర, మంచం, బిస్కెట్, ప్లూట్, జల్లెడ, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, పడవ, చైన్, చెప్పులు, గాలి బుడగ వంటి గుర్తులు ప్రకటించారు. వార్డు సభ్యులకు పొయ్యి, స్టూల్, బీరువా, గ్యాస్ సిలిండర్, గౌను, ఈల, కుండ, గరాట, మూ కుడు, డిష్ యాంటీనా, ఐస్‌క్రిమ్, గాజుగ్లాస్, పోస్ట్‌డబ్బా, కవర్, కటింగ్ ప్లేయర్, హాకీస్టిక్, కర్రబంతి, నైక్‌టై, విద్యుత్ స్తభం, షటిల్ వంటి గుర్తులను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment