సమస్యలు నా దృష్టికి తీసుకురండి
కోహెడ(హుస్నాబాద్): గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం కోహెడలో కాంగ్రెస్ కార్యకర్తలతో భేటీ అ య్యారు. గ్రామాల సమస్యలపై ఆరా తీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామగ్రామాన తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతోందని.. ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కేటాయిస్తామన్నారు. త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. సింగరాయ జాతర రోడ్డు మరమ్మతులు చేయాలని అధికారులను అదేశించినట్లు చెప్పారు. కోహెడకు కృషి విజ్ఞాన కేంద్రం మంజూరు చేశామన్నారు. ఇప్పటికే 55వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామన్నారు. కోహెడ, హుస్నాబాద్, సైదాపూర్ మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు వస్తామని మంత్రి కార్యకర్తలకు చెప్పారు. 30వేల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంద ధర్మయ్య, బొయిని నిర్మల, దొమ్మాట జగన్‌రెడ్డి, గాదాసు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment