బొందలగడ్డను వదలలే..
కౌడిపల్లి(నర్సాపూర్): కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా మారింది పలువురు నాయకుల తీరు. ప్రభు త్వ భూముల కబ్జా అటుంచి.. బొందలగడ్డను సైతం వదలడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. కోటి విలువ చేసే సుమారు 35 గుంటల భూమిని చదును చేసి మొరం పోసి ప్రహరీ నిర్మించేందుకు పూనుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కౌడిపల్లి నుంచి వెల్మకన్నకు వెళ్లేదారిలో ఎలుక చెరువు కట్ట అలుగు వద్ద బొందలగడ్డ ఉంది. గ్రామానికి చెందిన అన్నికులాలకు చెందిన చనిపోయిన వ్యక్తుల దహన సంస్కారాలు అక్కడ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎలుకచెరువు కట్ట సమీపంలో నర్సాపూర్‌కు చెందిన ఓ నాయకుడు గ్రామస్తుల వద్ద భూమి కొనుగోలు చేశాడు. పాసు పుస్తకంలో భూమి తక్కువగా వస్తుందని, రహదారికి ఆనుకొని ఉన్న బొందలగడ్డను చదునుచేసి కబ్జాకు పాల్పడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనికి స్థానికంగా కొందరు నాయకులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై గ్రామస్తులు ఇటీవల తహసీల్దార్ ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తామని చెప్పినా.. పనులు మాత్రం ఆగడం లేదన్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి బొందలగడ్డ కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment