మెదక్ కలెక్టరేట్: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా అధికారులు కృషి చేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి యాసంగి సాగునీటి సరఫరాపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సింగూరు ద్వారా ఘనపురం ఆయకట్టుకు 21,625 హెక్టార్లు సాగవుతుందని తెలిపారు. విడతల వారీగా సాగునీరు అందించడంలో సింగూరు నీటి అనుమతి కోసం లేఖ పంపించామన్నారు. ఈనెల 16 నుంచి మొదటి విడత సాగునీరు విడుదల చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,694 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 1,25,138 ఎకరాలు సాగవుతుందని తెలిపారు. సాగునీరు అందించడంలో ఎలా ంటి సమస్యలు తలెత్తకుండా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, డీఈ శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కృత్రిమ మేధతో
అనేక ఉపయోగాలు
సిద్దిపేటఎడ్యుకేషన్: కృత్రిమ మేధస్సు ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్నిరంగాల్లో వేగంగా దూసుకుపోతోందని, ఏఐతో అనేక ఉపయోగాలు ఉన్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఏఐపై రెండ్రోజుల జాయతీ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా కరీంనగర్ లైఫ్‌లైన్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సీహెచ్ ప్రదీప్‌కుమార్, సదస్సు అధ్యక్షురాలు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, ముఖ్యవక్తలు ప్రొఫెసర్ శరత్‌బాబు, తమిళనాడు ప్రొ ఫెసర్ డాక్టర్ పూర్ణచందర్ తదితరులు హాజరై మాట్లాడారు. భవిష్యత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుందని విద్యా, పరిశోధనా రంగాల్లో సైతం అనేక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని చెప్పారు. క్యాన్సర్ నివారణలో సైతం ఏఐని ఉపయోగించుకోవచ్చన్నారు. పరిశోధకులు ఏఐపై పట్టు సాధించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment