అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపు
మెదక్ మున్సిపాలిటీ: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పోలీసుశాఖలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని తెలంగాణ మహోన్నత, ఉత్తమ, సేవ పతకాలకు ఎంపిక చేశామన్నారు. జిల్లా నుంచి 15 మంది ఎంపిక కాగా ఇందులో ఒక మహోన్నత సేవా పతకం, 14 మందికి సేవా పతకాలు లభించాయని తెలిపారు. తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి మహోన్నత పతకానికి ఎంపిక కాగా పోచయ్య, ఎస్‌ఐ (రేగోడ్), అశోక్, ఏఎస్‌ఐ (రేగోడ్), పెంటప్ప ఏఎస్‌ఐ (అల్లాదుర్గ్), దేవిదాస్ ఏఎస్‌ఐ (అల్లాదుర్గ్), శివకుమార్, జమీల్ అబ్దుల్లా, లక్ష్మీనారాయణ, ఏఆర్‌ఎస్‌ఐ, డీఏఆర్ (మెదక్), రామానుజన్, కిష్టయ్య, జాఫర్, చంద్రప్ప, యాదగిరి, భూమయ్య సేవా పతకాలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈసందర్భంగా సిబ్బందిని ఎస్పీ అభినందించారు. పతకాలను త్వరలోనే అందిస్తామని చెప్పారు.
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment