మహిళల అభ్యున్నతికి మార్గదర్శి
● పూలే ఆశయాలను కొనసాగించాలి ● కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసినప్పుడే సావిత్రిబాయి పూలే ఆశ యాలు నెరవేరుతాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో పూలే జయంతి, జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యా, సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ భర్త జ్యోతిబా పూలే ప్రోత్సాహంతో ఉపాధ్యాయురాలు అయ్యారని గుర్తుచేశారు. మహిళలంతా ఆమె బాటలో నడిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఈఓ రాధాకిషన్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, సీపీఓ బద్రీనాథ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, యువజన క్రీడ ల నిర్వహణ అధికారి నాగరాజు, ఇతర శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రగతి పరుగులు పెట్టాలి
మెదక్‌జోన్: లక్షాన్ని నిర్దేశించుకుని అభివృద్ధిని వేగంగా పరుగులు పెట్టించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులు ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ ఉదయ్‌కుమార్, అదనపు కలెక్టర్ నగేశ్‌తో సహా జిల్లా అధికారులు కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం నూతన సంవత్సరం సందర్భంగా తనను కలిసేందుకు వచ్చే అధికారులు, ఇతర నాయకులు బొకేలతో కా కుండా విద్యార్థులకు ఉపయోగపడే పెన్నులు, నోట్‌బుక్‌లతో రావాలని కోరారు. దీంతో ఆయన కోరిక మేరకు చాలా మంది పెన్నులు, నోట్‌బుక్కులతో తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment