పకడ్బందీ చర్యలు
కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రమాదాల
నివారణకు
మెదక్ కలెక్టరేట్: రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. అతివేగం వల్ల వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఆరంభమయ్యే దగ్గరి నుంచి ముగింపు ప్రాంతం వరకు పోలీస్, నేషనల్ హైవే, మున్సిపల్ శాఖలకు చెందిన అధికారులు జాయింట్ ఇన్‌స్పెక్షన్ ద్వారా ప్రమాదాలు తరుచూ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. ప్రమాదాలకు గల కారణాలపై సమావేశాల ద్వారా చర్చించిన నివారణకు కృషి చేయాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ప్రమా దాలు జరిగే ముఖ్య ప్రదేశాలలో ప్రమాద సూచికలు, మలుపుల వద్ద స్పీడ్ లిమిట్ సూచికలు తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లా మీదుగా వెళ్తున్న ప్రధాన జాతీయ రహదారుల మీద రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు నేషనల్ హైవే అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై కళాశాలల యజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.
పోలీసు శాఖ విశేష కృషి
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ యంత్రాంగం విశేష కృషి చేస్తోందని ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు, డ్రంకెన్ డ్రైవ్‌లు, తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పాపారు. ప్రజల్లో చైతన్యం వచ్చేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బీ, పోలీస్, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ప్రజ లు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా పరిరక్షిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ సర్దార్ సింగ్, జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, మెదక్ మున్సిపల్ కమిషనర్, శ్రీనివాస్ రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, నేషనల్ హైవే, పంచాయతీ రాజ్, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment