ప్రత్యేక బస్సులు
నారాయణఖేడ్: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈనెల 10వ తేదీనుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. 10, 11, 12, 13వ తేదీల్లో ప్రత్యేక సర్వీసులు నడుస్తాయి. అనంతరం 14, 15 తేదీల్లో పండుగ ఉండడంతో ఆరోజుల్లోనూ సాధారణ సర్వీసులే ఉంటాయి. తిరుగు ప్రయాణంగా 16, 17, 18, 19, 20వ తేదీల్లో ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. గత పండుగల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని మెదక్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ అధికారులు 8 డిపోల నుంచి 542 సర్వీసులు 12 రోజులు నడిపి రూ.14.72కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. ఈ సంక్రాంతిని సైతం మంచి ఆదాయం సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
సర్వీసులు ఇలా..
మెదక్ రీజియన్ పరిధిలోని ఆయా డిపోలకు సంబంధించిన బస్సులు హైదరాబాద్ నుంచి ఆంధ్రలోని అమలాపురం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, కందుకూరు, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నారు. దీంతోపాటు ఆయా డిపోలకు చెందిన సర్వీసులు సైతం హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ డిపోకు సంబంధించి జేబీఎస్, సికింద్రాబాద్, లింగంపల్లి, పటాన్‌చెరు, జహీరాబాద్ డిపో.. జేబీఎస్, లింగంపల్లి, సంగారెడ్డి క్రాస్‌రోడ్, సంగారెడ్డి డిపో.. జేబీఎస్, సికింద్రాబాద్, గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ డిపో.. సికింద్రాబాద్, మెదక్ డిపో.. సికింద్రాబాద్, బాలానగర్ వయా నర్సాపూర్, సిద్దిపేట డిపో.. జేబీఎస్, కరీంనగర్, వేములవాడ, దుబ్బాక డిపో.. సికింద్రాబాద్, నర్సాపూర్ డిపో.. జేబీఎస్, బాలానగర్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.
50 శాతం చార్జీ పెంపు
సంక్రాంతి స్పెషల్ సర్వీసులుగా నడిచే బస్సుల్లో 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేయనున్నారు. ఉన్న చార్జీకి అదనంగా 50 శాతం చార్జీలు వసూలు చేస్తారు. ఈ సర్వీసుల్లో మహాలక్ష్మి టికెట్ వర్తింపుపై ఆర్టీసీ సంస్థ నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బస్సులు నడిపినా రద్దీ పెరిగిన పక్షంలో మరిన్ని సర్వీసులు సైతం నడిపేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
రద్దీ పెరిగితే మరిన్ని సర్వీసులు
మెదక్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి సంక్రాంతి స్పెషల్ సర్వీసులను నడుపుతున్నాం. 10 నుంచి 13 వరకు, అనంతరం 16 నుంచి 20 వరకు ఈ బస్సులు తిరుగుతాయి. రద్దీ పెరిగిన పక్షంలో అదనపు సర్వీసులు నడుపుతాం. స్పెషల్ బస్సుల్లో 50 శాతం చార్జీ అదనంగా ఉంటుంది.
– ప్రభులత, ఆర్.ఎం సంగారెడ్డి
ప్రత్యేక బస్సుల వివరాలు
డిపో హైదరాబాద్ నుంచి
డిపోల పరిధిలో.. ఆంధ్రకు
మెదక్ 40 5
నారాయణఖేడ్ 32 3
నర్సాపూర్ 17 3
సంగారెడ్డి 42 3
జహీరాబాద్ 37 1
సిద్దిపేట 57 0
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 36 0
దుబ్బాక 19 0
మొత్తం 280 15
డీఎంల పర్యవేక్షణ
నారాయణఖేడ్ 99592–23170
జహీరాబాద్ 99592–26269
సంగారెడ్డి 99592–26267
గజ్వేల్– ప్రజ్ఞాపూర్ 99592–26270
మెదక్ 99592–26268
సిద్దిపేట 99592–26271
దుబ్బాక 99592–26271
నర్సాపూర్ 99592–26268
Comments
Please login to add a commentAdd a comment