సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు
నర్సాపూర్: ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డీఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు అన్నారు. బుధవారం పలుశాఖల అధికారులతో కలిసి నర్సాపూర్, మెదక్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న దేవాలయ భూములను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్‌లో వంద ఎకరాల దేవాలయ భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సబ్‌స్టేషన్ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో భూములు ఉన్నందున ప్లాంట్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని అన్నారు. నర్సాపూర్‌లో వంద ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తే 25 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుందన్నారు. కాగా దేవాలయ భూముల వివరాల నివేదికను కలెక్టర్ త్వరలోనే ప్రభుత్వానికి పంపుతారని వివరించారు. కాగా నర్సాపూర్‌లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి 148 ఎకరాల భూములు ఉన్నాయని, వాటిలో వంద ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉన్నట్లు ఈఓ సార శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శంకరయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఈఓ సార శ్రీనివాస్, ఆర్‌ఐ సిద్దిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment