క్రీడలతో మానసిక ఉల్లాసం
మెదక్ మున్సిపాలిటీ: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించి మాట్లాడారు. డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డు ఇలా హోదా లను పక్కన పెట్టి తమ జట్టును గెలిపించుకునేందుకు కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. జిల్లాలో మూడోసారి స్పోర్ట్స్ మీట్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పో టీలకు జిల్లా తరఫున పంపిస్తామని వివరించారు. అంతకుముందు పోలీస్ అధికారులతో ఎస్పీ నేరాలపై సమీక్ష నిర్వహించారు. ఇంటర్– ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్లకు అందించిన ట్యాబ్‌ల ద్వారా ఐసీజేఎస్ పోర్టల్‌లో ఏడేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష గల నేరాలకు సంబంధించిన అంశాలను అప్‌లోడ్ చేయాలన్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, టౌన్ సీఐ నాగరాజు, అల్లాదుర్గ్ సీఐ రేణుకారెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment