పాఠకుల సమస్యలు పరిష్కరిస్తాం
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి
కౌడిపల్లి(నర్సాపూర్): గ్రంథాలయాల్లో పాఠకుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. బుధవారం కౌడిపల్లి శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్య దర్శి వంశీకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలో సొంత భవనంలోనికి లైబ్రరీని మారుస్తామని తెలిపారు. బీసీ కమ్యూనిటీ హాల్‌లో ఎలాంటి సదుపాయాలు లేక పాఠకులు ఇబ్బంది పడతున్నట్లు గుర్తించామన్నా రు. గ్రంథాలయ భవనంలో కొనసాగుతున్న పీఆర్ డివిజన్ కార్యాలయాన్ని మరో భవనంలోకి మార్చే ందుకు గానూ వ్యవసాయశాఖ ఏఓ, ఐకేపీ ఉత్పత్తిదారులు సంఘం కార్యాలయాలను పరిశీలించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడంతో కౌడిపల్లికి చెందిన విద్యా ర్థులు జిల్లా గ్రంథాలయానికి వెళ్లి చదువుకుంటు న్నారని చెప్పారు. మెరుగైన వసతులు కల్పించి నిరుద్యోగులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్ డీఈ ప్రభాకర్, ఏఈ మారుతి, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment