మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
మెదక్‌జోన్: మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు వారి కాళ్ల మీద వారే నిలబడాలన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో మీ సేవ, పౌల్ట్రీ, నాటు కోళ్ల పెంపకం, క్యాంటీన్లు, ఇతర 20 రకాల యూనిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఏడాది రూ. 100 కోట్లు లక్ష్యంగా పెట్టుకొని మహిళలకు పంపిణీ చేస్తున్నామన్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటులో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు కృషి హర్షనీయమని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఏ శ్రీనివాసరావు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం
మెదక్ కలెక్టరేట్: మండలాల అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో పలు అంశాలపై అధికారులతో చర్చించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా భూమిని గుర్తించడంలో కృషి చేయాలని సూచించారు. అంతకుముందు జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment