‘సీడీపీఓ’లో ఇన్‌చార్జీల పాలన | - | Sakshi
Sakshi News home page

‘సీడీపీఓ’లో ఇన్‌చార్జీల పాలన

Published Wed, Jan 8 2025 7:04 AM | Last Updated on Wed, Jan 8 2025 7:04 AM

‘సీడీపీఓ’లో ఇన్‌చార్జీల పాలన

‘సీడీపీఓ’లో ఇన్‌చార్జీల పాలన

అల్లాదుర్గం(మెదక్‌): అల్లాదుర్గం సీడీపీఓ కార్యాలయంలో సిబ్బంది లేక అస్తవ్యస్తంగా మారింది. కార్యాలయంలో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అల్లాదుర్గం ప్రాజెక్టు పరిధిలో రేగోడ్‌, టేక్మాల్‌, పెద్దశంకరంపేట మండలాలు ఉన్నాయి. ఇందులో 9 సెక్టార్లలో 230 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం అందాల్సి ఉంది. 9 సెక్టార్లకు ఐదుగురు మాత్రమే అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఒక సూపర్‌వైజర్‌ ఐదేళ్లుగా డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. సీడీపీఓ, ఏసీడీపీఓలు కూడా డిప్యూటేషన్‌పైనే ఉన్నారు. సీడీపీఓగా లిఖిత 2022 అక్టోబర్‌లో బదిలీపై వచ్చారు. కార్యాలయంలో అడుగు పెట్టకుండానే, హైదరాబాద్‌ సీ్త్ర శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. మూడేళ్లుగా ఇన్‌చార్జీలతోనే అల్లాదుర్గం సీడీపీఓ కార్యాలయం కొనసాగుతుంది. ఇక్కడ రెగ్యులర్‌ సీడీపీఓని డిప్యూటేషన్‌ వేసి రామాయంపేట గ్రేడ్‌ సూపర్‌వైజర్‌ను ఇన్‌చార్జిగా డిప్యూటేషన్‌ వేయడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

● 2020 ఆగస్టులో నిజామాబాద్‌ జిల్లా నుంచి జ్ఞానేశ్వరి పదోన్నతిపై అల్లాదుర్గం ప్రాజెక్టుకుకు ఏసీడీపీఓగా బదిలీపై వచ్చారు. జాయినింగ్‌ అయ్యి, వారం రోజుల పాటు సెలవులపై వెళ్లారు. సెలవుల నుంచి వచ్చిన ఏసీడీపీఓ నిజామాబాద్‌ జిల్లా బీమ్‌గల్‌ ప్రాజెక్టుకు డిప్యూటేషన్‌ వేసుకుని వెళ్లిపోయారు. ఏసీడీపీఓ డిప్యూటేషన్‌పై వెళ్లి ఐదేళ్లు గడుస్తున్నా మరొకరిని నియమించలేదు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అధికారులు ఇష్టం వచ్చినట్లు అక్రమ డిప్యూటేషన్లకు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

● అల్లాదుర్గం ప్రాజెక్టులో నవ్య.. గ్రేడ్‌1 సూపర్‌ వైజర్‌ విధులు నిర్వహించేవారు. ఈమె సహితం హైదరాబాద్‌లోని పుడ్‌ కమిషనరేట్‌కు డిప్యూటేషన్‌ వేసుకుని ఐదేళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటేషన్‌ వేస్తున్న అధికారులు ఈ స్థానంలో మరొకరిని ఎందుకు నియమించడం లేదో తెలియని పరిస్థితి. 9 సెక్టార్లకు ఐదుగురు సూపర్‌వైజర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 4 పోస్టులు ఖాళీ ఉండగా ఉన్న సూపర్‌వైజర్‌ను ఎలా డిప్యూటేషన్‌ వేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తొమ్మిది ఏళ్లుగా అద్దె భవనం, పోస్టుల ఖాళీ

అల్లాదుర్గంలో సీడీపీఓ కార్యాలయం 2016లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొమ్మిదేళ్లుగా కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతుంది. కార్యాలయంలో డిప్యూటేషన్ల తంతు కొనసాగుతుండగా మరో వైపు జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇటీవలే భవన నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించారు. కాగా, ప్రభుత్వం నిధులు ఎప్పుడు మంజూరు చేస్తుందో, భవనం ఎన్నేళ్లకు పూర్తవుతుందో తెలియని పరిస్థితి.

రద్దు చేయండి

అల్లాదుర్గం సీడీపీఓ కార్యాలయంలో కొనసాగుతున్న అక్రమ డిప్యూటేషన్లను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రద్దు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఉన్న సిబ్బందిని ఎందుకు డిప్యూటేషన్‌ వేశారో పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి మంత్రి ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

ఇన్‌చార్జీల పాలనలో సీడీపీఐ కార్యాలయం కొనసాగుతోంది. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. పోస్టుల ఖాళీకి తోడు అధికారుల డిప్యూటేషన్‌లు. వెరసి అధికారుల అండదండలతో జిల్లా సరిహద్దులు దాటి డిప్యూటేషన్‌ల విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది లేక అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ కొరవడుతోంది. వైద్యారోగ్య శాఖ మంత్రి ఇలాకాలో ఉన్న అల్లాదుర్గం సీడీపీఓ కార్యాలయం దుస్థితి అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

అసలే పోస్టులు ఖాళీ

ఆపై సీడీపీఓ, ఏసీడీపీఓల డిప్యూటేషన్లు

ఇన్‌చార్జిగా రామాయంపేట గ్రేడ్‌ సూపర్‌వైజర్‌కు బాధ్యతలు

అల్లాదుర్గం ప్రాజెక్టులో230 అంగన్‌వాడీలు

మంత్రి దామోదర ఇలాకాలోనేఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement