ఉపాధ్యాయుల సమస్యలపరిష్కారానికి కృషి
పెద్దశంకరంపేట(మెదక్): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ నిరంతరం కృషి చేస్తుందని మెదక్ జిల్లా ఎస్టీయూ అధ్యక్షుడు రాజగోపాల్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పోచయ్యలు పేర్కొన్నారు. పెద్దశంకరంపేట మండల పరిధిలోని మూసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎస్టీయూ రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్, మండల విద్యాధికారి వెంకటేశం ఎస్టీయూ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్టీయూ మండల అధ్యక్షుడు నందయ్యగారి శ్రీనివాస్, బాధ్యులు రాధాకిషన్, కుమార్, అశోక్‌రెడ్డి, ఆనంద్, వెంకట్, శేఖర్ గౌడ్ అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గ్రామ సమైక్య రికార్డుల పరిశీలన
శివంపేట (నర్సాపూర్ ): గ్రామ సమైక్యకు సంబంధించి రికార్డులను సోషల్ ఆడిట్ సిబ్బంది మంగళవారం పరిశీలించింది. ఆరు నెలలకు సంబంధించి జమ ఖర్చుల వివరాలు నమోదును పరిశీలించడంతోపాటు పలు సూచనలు చేసింది. కార్యక్రమంలో ఏపీఎం వెంకటేశ్వర్లు, ఆడిటర్లు నాగరాజు, దత్తాత్రేయ గ్రామ సమైక్య అధ్యక్షురాలు, సీఏలు సిబ్బంది ఉన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి
నర్సాపూర్ రూరల్: ప్రతీ విద్యార్థికి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని కర్పెడ్ సంస్థ ఆర్గనైజర్ రాజేందర్ విద్యార్థులకు సూచించారు. మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మంగళవారం కర్పెడ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు సబ్బులు, శానిటైజర్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రాంబాబు, ఉపాధ్యాయులు శంకర్, సుధీర్ కుమార్ గౌడ్, మల్లేష్ సాయి కుమార్ పాల్గొన్నారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులసమ్మె విరమణ
మెదక్ కలెక్టరేట్: రెగ్యులరైజ్ లక్ష్యంతో కలెక్టరేట్ వద్ద నిరవధిక సమ్మె చేపట్టిన సమగ్ర శిక్షా ఉద్యోగులు మంగళవారం విరమించారు. మెదక్ సమీకృత కలెక్టరేట్‌లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఏడీ విజయలక్ష్మికి సమ్మె విరమణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సంఘం నాయకులు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అంశమైన పేస్కేల్ అమలు చేయడానికి ప్రభుత్వం 4 నెలల సమయం తీసుకుంటుందన్నారు. మిగతా ఆర్థికేతరంశాలన్నీ పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో చర్చలు సఫలం అయ్యాయని తెలిపారు. ఈ మేరకు తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నామని జిల్లా జేఏసీ అధ్యక్షులు రాజు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లాలోని సమగ్ర శిక్షా అన్ని విభాగాల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎస్టీయూ క్యాలెండర్‌ను
ఆవిష్కరిస్తున్న ఎస్టీయూ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment