రామాయంపేటలో బంద్ సంపూర్ణం
రామాయంపేట(మెదక్): రామాయంపేటలో బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మించొద్దంటూ.. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి తెరిచి ఉన్న దుకాణాలు మూయించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు మాట్లాడారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతో రామాయంపేటకు మరింతగా నష్టం వాటిల్లుతుందన్నారు. ఇప్పటికే జాతీయ రహదారి 47తో పట్టణంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయన్నారు. మెదక్–ఎల్కుతుర్తి జాతీయ రహదారి బైపాస్ నిర్మాణంతో మరింతగా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ని యోజకవర్గకేంద్రం ఎత్తివేయడంతో రామాయంపేట చిన్న గ్రామంగా మారిందన్నారు. బైపాస్ నిర్మాణంతో మరింతగా ప్రాధాన్యత తగ్గుతుందని పేర్కొన్నారు. దీంతో బైపాస్ వద్దంటూ బాధితులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు తహసీల్దార్ రజనికుమారికి వినతిపత్రం అందజేశారు.
బైపాస్ రోడ్డుకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ
దుకాణాలను మూసివేయించినవ్యాపారులు
Comments
Please login to add a commentAdd a comment