గుజరాత్ ఐఐటీ కార్యశాలకు రవివర్మ
కోహెడరూరల్(హుస్నాబాద్): గుజరాత్ రాష్ట్రం ఐఐటీ గాంధీనగర్‌లో జరిగిన సీసీఎల్ సృజనాత్మక బోధన ప్రయోగ కార్యశాలకు కోహెడ మండలం వింజపల్లి పరిధిలోని పెరుకలగడ్డ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.రవివర్మ పాల్గొన్నారు. 5రోజుల పాటు జరిగే శిక్షణలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రయోగ పూర్వకంగా అభ్యాసనం, పరిసరాలలో నిరుపయోగ వస్తువుల ద్వారా సైన్స్, గణిత అంశాలను తయారుచేయడంలో మెలకువలు తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రల నుంచి వచ్చిన విద్యావేత్తలతో సమష్టిగా పాల్గొన్నారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీసేలా ఉండి ప్రతి వస్తువుతో ఒక శాసీ్త్రయంగా ఆలోచన కలుగుతుందని అని ఆయన ఫోన్‌లో ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment