నర్సాపూర్‌లో విషాదఛాయలు
నర్సాపూర్ రూరల్: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సాపూర్ పంచాయతీరాజ్‌శాఖలో ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న పాపగారి మనిషా (24), నర్సాపూర్ మండలంలోని రుస్తుంపేటకు చెందిన విద్యార్థిని ఐశ్వర్య (20) మృతి చెందడంతో నర్సాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఐశ్వర్య స్నేహితులు బోరున విలపించగా.. ఏఈ మనిషా మృతి విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్‌శాఖ డీఈ రాధికారెడ్డి, ఇతర ఏఈలు కంటతడిపెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఎమ్మెల్యే సునీతారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌తో పాటు ఆయా పార్టీల నాయకులు మృతదేహాలను సందర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment