చట్టాలపై అవగాహనఅవసరం
మెదక్ కలెక్టరేట్: ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద సిబ్బందికి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ప్యా నల్ లాయర్స్, పారా లీగల్ వలంటీర్లకు బాల్య వివాహాలు.. తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, జిల్లా బాలల సంరక్షణ అధికారిణి కరుణశీల, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ గంగాధర్, ప్యానెల్ లాయర్లు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలోఅంతరాయం
పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని మిన్‌పూర్ 132 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నర్సింలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా పొడిచన్‌పల్లి, నార్సింగి, కొత్తపల్లి, అచ్చన్నపల్లి, గాజులగూడెం, కొడుపాక, కుర్తివాడ 33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
‘ఇందిరమ్మ’ సర్వే
వేగవంతం చేయాలి
టేక్మాల్(మెదక్)/చిలప్‌చెడ్(నర్సాపూర్): గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ సర్వేను వేగవంతం చేయాలని మెదక్ డీఎల్‌పీఓ సురేష్‌బాబు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం టేక్మాల్‌లో సర్వేను పరిశీలించారు. అనంతరం తంపులూరు పంచాయతీని సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడడంతో పాటు ఇందిరమ్మ యాప్‌లో వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విఠల్, ఎంపీఓ రియజొద్దీన్, ఈఓ రాకేష్, పంచాయతీ కార్యదర్శి పోచయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే చిలప్‌చెడ్ మండలం చండూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను నర్సాపూర్ డీఎల్‌పీఓ సాయిబాబా ఎంపీడీఓ ఆనంద్‌తో కలిసి పరిశీలించారు. మండలంలో 85 శాతం సర్వే పూర్తయిందని వెల్లడించారు.
రేగోడ్ పీహెచ్‌సీకి 108
రేగోడ్(మెదక్): ఎట్టకేలకు రేగోడ్ పీహెచ్‌సీకి 108 మంజూరైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రి దామోదర రాజనర్సింహ 108 మంజూరు చేయగా.. కొంతకాలం తర్వాత మరో మండలానికి తరలించారు. దీంతో చాలా మందికి సకాలంలో వైద్యం అందక మృతిచెందారు. రేగోడ్‌లో 108 ఏర్పాటు చేయాలని గతంలో ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించింది. తాజాగా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మంత్రి 108 మంజూరు చేశారు. శుక్రవారం రాత్రి రేగోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.
కుక్కదాడిలోబాలుడికి గాయాలు
హవేళిఘణాపూర్(మెదక్): అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఆడుకుంటున్న ఓ బాలుడిపై కుక్క దాడి చేసింది. మండలంలోని దూప్‌సింగ్ తండాకు చెందిన బొడావత్ శ్రీనివాస్ కుమారుడు సాయిదీప్ ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం తండాలోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాడు. ఆవరణలో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుక్క దాడి చేయడంతో గాయపడ్డాడు. బాలుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment