ప్రజారోగ్యంపై దృష్టి సారించాలి
నర్సాపూర్: క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి డీఎంహెచ్‌ఓ శ్రీరాం సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం వైద్యశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జాతీయ కార్యక్రమాలపై వైద్యులు, సూపర్‌వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల టీబీ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. టీబీతో పాటు మలేరియా, లెప్రసీ తదితర వ్యాధులపై దృష్టి పెట్టాలన్నారు. ఆయా వ్యాధుల లక్షణాలు కలిగిన వారిని గుర్తించి, సకాలంలో దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన టెస్టులు చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత సంవత్సరంలో లక్ష్యాన్ని చేరాలని సూచించారు. సమావేశంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నవీన్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సృజన తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని డీఎంహెచ్‌ఓ కేక్ కట్ చేశారు.
డీఎంహెచ్‌ఓ శ్రీరాం
Comments
Please login to add a commentAdd a comment