ముగ్గులు వేసి.. నిరసన తెలిపి
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 24వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా ప్రధాన గేటు ఎదుట మహిళా ఉద్యోగులు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో గెలిపించున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి మా జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, కార్యదర్శి పాషా, రాజశేఖర్, సంపత్, శంకర్, కవిత, మంజుల, ధరణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment