మాటలేగానీ చేతలేవి..?
మనోహరాబాద్(తూప్రాన్): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఏ మాత్రం మార్పు కానరావడం లేదని మెదక్ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ హేమలత విమర్శించారు. పాలకుల వైఫల్యం కారణంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. గురువారం మనోహరాబాద్‌లో విలేకరులతో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో గ్రామాలు పురోగతి సాధించాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారన్నారు. అప్పట్లో ప్రతి గ్రామం నందనవనంగా మార్చామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతుందని, పంచాయతీ కార్యదర్శులు సర్వేలంటూ తిరుగుతున్నారని, ఎక్కడి పనులు అక్కడే నిల్చిపోయాయని మండిపడ్డారు. ఇప్పటికి గ్రామ పంచాయతీలకు నిధులు రాలేదని, గత ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో ఈ ఏడాది పూర్తయ్యిందని ఆమె తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని, మాటలు తప్ప, చేతలు లేవని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు శేఖర్‌గౌడ్, మండల పార్టీ నాయకులు దాసరి నరేష్, రతన్‌లాల్, భిక్షపతి, స్వామిగౌడ్, శ్రీనివాస్, శైలేందర్, ప్రభాకర్‌యాదవ్, ఇర్ఫాన్ తదితరులు ఉన్నారు. కాగా, సీఎంరిలీఫ్ ఫండ్ నుంచి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 11 మందికి కలిపి రూ.2.80 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధి
జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ హేమలత ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment