ఏకీకృత పెన్షన్ మాకొద్దు
పాపన్నపేట(మెదక్): త్వరలో అమలు కానున్న ఏకీ కృత పెన్షన్‌ను ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని పొడిచన్‌పల్లి ఉన్నత పాఠశాలలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. యూపీఎస్ ఉద్యోగులను మోసగించి కార్పొరేట్ల కడుపు నింపడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. సభ్యత్వ నమోదుకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి చంద్రం, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రమే ష్, సాజిద్, దేవయ్య, కిషన్, మాధవరెడ్డి, గణేష్, శివకుమార్, చంద్రకాంత్ పాల్గొన్నారు.
సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ
Comments
Please login to add a commentAdd a comment