బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి బీఆర్‌ఎస్ కార్యకర్తలపై, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డిలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హ యాంలో కంటే ఈ ప్రభుత్వంలో ఈ ఏడాది ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే సుమారు వెయ్యి కేసులు పెరిగాయన్నారు. 2022లో జిల్లాలో 6,429 కేసులు నమోదైతే, 2024లో 7,563 కేసులు నమోదయ్యాయన్నారు. మహిళలపై అత్యాచారాల కేసులు 31% పెరిగాయని, దాదాపు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఈ కేసులు పెరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. హోంమంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఫల్యమేనన్నారు. ఈ ప్రభుత్వ హ యాంలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని ఆరోపించారు. గంజాయి, గుడుంబాకు తెలంగాణ అడ్డాగా మారిందని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, ఉమ్మడిమెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, మాజీ సీడీసీ చైర్మన్ కాసాలబుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలి
సదాశివపేట(సంగారెడ్డి): అయ్యప్పస్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా జీవించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం పట్టణంలో జరిగిన మహా పడిపూజతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ 29వ ఇరుముడి, షష్టిపూర్తి తులాభారం కార్యక్రమానికి హాజరయ్యారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ మంజూశ్రీ, బీఆర్‌ఎస్ నాయకులు పట్నం మాణిక్యం, జైపాల్‌రెడ్డి, శివకుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులు త దితరులు పాల్గొన్నారు.
గంజాయి, గుడుంబాకు
అడ్డాగా తెలంగాణ
శాంతిభద్రతల పరిరక్షణలో
ప్రభుత్వం విఫలం
మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment