నూతనోత్సాహం..
నూతన సంవత్సర వేళ బుధవారం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఏడుపాయల జనారణ్యంగా మారింది. కలెక్టర్ రాహుల్‌రాజ్ దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించి సరదాగా గడిపారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన మెదక్ సీఎస్‌ఐ చర్చి ఏసయ్య నామస్మరణతో మారుమోగింది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈసందర్భంగా రిటైర్డు బిషప్ కనకప్రసాద్ భక్తులనుద్దేశించి దైవ సందేశం ఇచ్చారు. అంతకుముందు మతపెద్దలు శిలువను చర్చి చుట్టూ ఊరేగించారు. – మెదక్‌జోన్/పాపన్నపేట(మెదక్)
Comments
Please login to add a commentAdd a comment