ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
మెదక్ కలెక్టరేట్: రాష్ట్రస్థాయి సీఎం కప్ సాఫ్ట్‌బాల్ పోటీలు జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా సాగుతున్నాయి. సోమవారం 4వ రోజు జరిగిన సాఫ్ట్‌బాల్ పోటీల్లో 8 జట్లు పాల్గొన్నాయి. పురుషులకు జిల్లా కేంద్రంలోని అవుట్‌డోర్ స్టేడియం, మహిళలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోటీలు నిర్వహించారు. మహిళల విభాగంలో జగిత్యాలపై నిజామాబాద్, వరంగల్‌పై మెదక్, హైదరాబాద్‌పై సిద్దిపేట, మహబూబ్‌నగర్‌పై హనుమకొండ జట్లు గెలుపొందాయి. అలాగే పురుషుల విభాగంలో హనుమకొండపై మహబూబ్‌నగర్, రంగారెడ్డిపై నిజామాబాద్, వరంగల్‌పై మెదక్, అదిలాబాద్‌పై హైదరాబాద్ జట్లు గెలుపొందాయి. సోమవారం మ్యాచ్‌లు ముగిసేసరికి పురుషుల విభాగంలో నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, హనుమకొండ జిల్లా జట్లు సెమిఫైనల్ చేరాయి. మహిళల విభాగంలో నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, హైదరాబాద్ జట్లు సెమీ ఫైనల్ చేరినట్లు జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్యాంసుందర్ శర్మ, పీడీలు శ్రీనివాసరావు, మాధవరెడ్డి, శ్యాం, రవి, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సెమీ ఫైనల్‌కు చేరిన 8 జట్లు
Comments
Please login to add a commentAdd a comment