విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులు శ్రద్ధగా చదివి ఏ గ్రేడ్ సాధించాలని డీటీడీఓ నీలిమా అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాల, ఎస్టీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, స్టోర్‌రూంను పరిశీలించి నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అ నంతరం విద్యార్థులతో మాట్లాడారు. శ్రద్ధగా చదివి ఏ గ్రేడ్ సాధించాలన్నారు. పాఠ్యాంశాలు పూర్తయ్యాయా.. రివిజన్ చేస్తున్నారా? అని పదో తరగతి విద్యార్థులను ప్రశ్నించారు. క్లాస్‌లో అర్థం కాకపోతే స్టడీ అవర్‌లో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. సెలవు రోజుల్లో తప్ప చిన్న చిన్న పండుగలకు ఇంటికి వెళ్లవద్దన్నారు. పాఠశాలలో నాణ్యమైన భోజనం పెడుతున్నామని, బయటి వస్తువులు తినొద్దని సూచించారు. కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల సంక్షేమ అధికారి జయరాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
డీటీడీఓ నీలిమా
Comments
Please login to add a commentAdd a comment