అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 72 వినతులు అందజేశారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. వినతులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో ధరణి సమస్యలు 18, పింఛన్లు 4, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు 18, రుణమాఫీ 7, ఇతర సమస్యలపై 25 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓపీడీ శ్రీనివాస్‌రావు ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్
Comments
Please login to add a commentAdd a comment