పేటకు ఇంటిగ్రేటెడ్ స్కూల్
● ఇటీవల శంకుస్థాపన చేసినసీఎం రేవంత్‌రెడ్డి ● త్వరలో మంజూరు కానున్న నిధులు
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నమూనా
రామాయంపేట(మెదక్): రామాయంపేటకు ప్రతి ష్టాత్మక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైంది. సామాజిక అంతరాలు లేని అన్నివర్గాలకు చెందిన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరు చేసింది. ఇందులో భాగంగా మెదక్ నియోజకవర్గ పరిధిలోని రామాయంపేటలో ఏర్పా టు చేయనుండగా.. ఈనెల 25న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
25 ఎకరాల్లో నిర్మాణం
రామాయంపేట పట్టణ శివారులోని జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 1421 సర్వే నంబర్‌లో 25 ఎకరాల మేర ప్రభుత్వ భూమిని సమీకృత గురుకులం కోసం ఎంపిక చేశారు. ఇటీవల కలెక్టర్ రాహుల్‌రాజ్, ఇతర అధికారులు స్థలాలను పరిశీలించారు. ఈక్రమంలో రామాయంపేటలో అనుౖ వెన స్థలం ఉండటంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా మంజూరు చేసింది. స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన నిధులు రూ. 200 కోట్లు త్వరలో మంజూరవుతాయని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ప్రకటించారు.
స్కూల్ ప్రత్యేకతలివే..
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌లో నాల్గవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు మొత్తం 2,560 మంది విద్యార్థులు చదువుకోనున్నారు. వీరికి ఉచిత వసతితో పాటు నాణ్యమైన భోజనం అందజేస్తారు. స్కూల్‌లో అధునాతన సదుపాయాలను కల్పిస్తారు. కాంప్లెక్స్‌లో వేర్వేరు బ్లాక్‌లతో పాటు విద్యార్థులకు బోధించడానికి మొత్తం 120 మంది టీచర్లు పనిచేస్తారు. వీరే కాకుండా ఇతర క్లారికల్ పోస్టులు సైతం ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇందులో ఏర్పాటయ్యే లైబ్రరీలో ఐదు వేల పుస్తకాలుంటాయి. 60కి పైగా కంప్యూటర్లతో పాటు అన్ని తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. స్కూల్ నిర్మించే ప్రాంతంలో గత 25 ఏళ్లుగా నమోదవుతున్న ఊష్ణోగ్రతలు, వర్షపాతం, చలి, వేడిగాలుల తీవ్రత, ఇతర అంశాలను ఆర్కిటెక్ సంస్థ పనిగణలోకి తీసుకుంటుంది. వాతావరణానికి అనుకూలంగా ఉండే రీతిలో భవన నిర్మాణానికి డిజైన్ రూపొందించారు. ప్రతి డార్మెటరీలో పది బెడ్లతో పాటు రెండు బాత్రూంలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
క్రీడలకు ప్రాధాన్యం
క్యాంపస్‌లో డిజిటల్ తరగతి గదులతో పాటు ల్యాబ్‌లు, ఆడిటోరియం, ఇండోర్ స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ మైదానాలు, టెన్సీస్ కోర్టు లు, అవుట్‌డోర్, ఇండోర్ జిమ్, ఇతర సదు పాయాలు కల్పించనున్నారు. క్రీడలతో పాటు ప్రత్యేకించి కళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
మొదటి విడతలోనే సాధించాం
మెదక్ నియోజకవర్గానికి మొదటి విడతలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించుకున్నాం. ఇది జిల్లాకే గర్వకారణం. మొదటి విడతలో కేవలం మంత్రుల నియోజకవర్గాల్లోనే మంజూరు కాగా, తాము సీఎం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించుకున్నాం. అలాగే నియోజకవర్గ పరిధిలో నెలకొన్న ఇతర సమస్యలను సైతం పరిష్కరిస్తా.
– మైనంపల్లి రోహిత్‌రావు,
మెదక్ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment