సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
శివ్వంపేట(నర్సాపూర్): కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం శివ్వంపేటలో చేపట్టిన సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు ఐదు నెలల నుంచి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి జీఓ 60 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జనవరి మొదటి వారంలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు వెంకటేష్, శ్రీకాంత్, శంకర్, బాలకృష్ణ, వసంత, పద్మ, స్వామి తదితరులు పాల్గొన్నారు.
అమిత్‌షా బహిరంగక్షమాపణ చెప్పాలి
తూప్రాన్: పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బహిరంగా క్షమాపణలు చెప్పాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోళ్ల రవిబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రహదారిపై అమిత్‌షా చిత్రపటాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా దేశంలో అట్టడుగువర్గాల ప్రజలందరికీ న్యాయం జరిగిందన్నారు. అమిత్‌షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో జిల్లా ఇన్‌చార్జి సుమన్, నాయకులు సుధాకర్ యాదవ్, నరేష్, లక్ష్మణ్, రమేష్, చంద్రమౌళి, చంద్రమౌళి యాదవ్, దీపిక తదితరులు పాల్గొన్నారు.
వారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం
కొల్చారం(నర్సాపూర్): కిష్టాపూర్‌లో విద్యుత్‌షాక్‌తో మృతిచెందిన నవీన్, ప్రసాద్ కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శుక్రవారం పరామర్శించారు. తనవంతుగా ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి కొల్చారం చేరుకొని ఎస్‌ఐ సాయికమార్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశంగౌడ్, నాయకులు శంకర్, శ్రీశైలం తదితరులు ఉన్నారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులకు న్యాయం చేయాలి
చేగుంట(తూప్రాన్): సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం చేగుంటలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. 18 సంవత్సరాలుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలన్నారు. సమ్మెతో సమగ్ర శిక్షా ఉద్యోగుల బాధ్యతలను ఉపాధ్యాయులకు అ ందించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తపస్ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, కృష్ణమూర్తి, రేఖ, సుమతి, సురేందర్, కృష్ణమూర్తి, అమరేశ్వరీ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment