నేరాల నియంత్రణకు ప్రణాళిక
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరాలు, చోరీలు, రోడ్డు ప్రమాదాలు జిల్లాలో తగ్గించడమే నూతన సంవత్సర లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం జిల్లాలోని పోలీసు అధికారులతో కలిసి ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తాం. దొంగతనాల అరికట్టేందుకు మేము సైతం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అత్యవసరం ఉన్న 180 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. దీంతో చాలా వరకు చోరీలు అరికట్టాం. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గింది. బైక్ చోరీలను సైతం తగ్గాయి. జిల్లాలో సైబర్ క్రైమ్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటిని నూతన సంవత్సరంలో మరింత తగ్గించేందుకు పనిచేస్తాం. శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం సిబ్బంది కృషి చేస్తోంది. నూతన సంవత్సరంలోనూ సీసీ కెమెరాల సంఖ్యను పెంచుతాం.
Comments
Please login to add a commentAdd a comment