పురుషుల సాఫ్ట్‌బాల్ విజేత హైదరాబాద్
● మహిళల విభాగంలో నిజామాబాద్ ● విజయవంతంగా ముగిసినసీఎం రాష్ట్రస్థాయి కప్ పోటీలు
విజేతగా నిలిచిన నిజామాబాద్ మహిళల జట్టు
మెదక్ కలెక్టరేట్: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పురుషల విభాగంలో విజేతగా హైదరాబాద్, మహిళల విభాగంలో నిజామాబాద్ జట్టు గెలుపొందింది. మెదక్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజులు నుంచి జరుగుతున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో హైదరాబాద్ జట్టు గెలుపొందింది. నిజామాబాద్ జట్టు రెండవ స్థానం, మెదక్ జిల్లా జట్టు మూడవ స్థానం పొందింది. మహిళల విభాగంలో నిజామాబాద్ జట్టు తొలిస్థానంలో నిలిచింది. సిద్దిపేట జిల్లా జట్టు రెండో స్థానం, హనుమకొండ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజు మాట్లాడారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చారన్నారు. క్రీడాకారులు ప్రతిభ చాటుకున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో మొట్ట మొదటిసారిగా రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు జరగడం హర్షణీయమన్నారు. క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించామన్నారు. పోటీల్లో మొదటిస్థానం సాధించిన జట్టుకు రూ.లక్ష, ద్వితీయస్థానం పొందిన జట్టుకు రూ.75వేలు, తృతీయస్థానం జట్టుకు రూ.25వేలు అందజేయనున్నారు. కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్యాంసుందర్ శర్మ, భరత్ కుమార్, నాగరాజు, శ్రీనివాసరావు పీడీలు మాధవరెడ్డి, శ్యామ్, రవి, దేవేందర్ రెడ్డి, రవి, రూపేందర్, అల్లి నరేశ్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment