అర్హులకు సంక్షేమ ఫలాలు
బుధవారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2025
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో అర్హత కలిగిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరిస్తాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ పథకంలో అసలైన పేదలను గుర్తిస్తాం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉన్నారు. అధికారులంతా బాధ్యతగా వ్యవహరించి అర్హులను గుర్తించాలని ఆదేశాలిచ్చాం. ఈ వారంలో వారితో కలిసి నేను రెండు పర్యాయాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తా. జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి గత ఏడాది పనితీరు పరిశీలించడంతోపాటు నూతన సంవత్సరంలో శాఖలవారీగా అధికారులకు లక్ష్యాలు నిర్దేశిస్తా. మెడికల్ కళాశాల ఏర్పాటు ఎంతో సంతృప్తి నిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment