మెరుగైన సేవలుఅందించాల్సిందే
శివ్వంపేట(నర్సాపూర్): అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు గర్భిణులకు బాలింతలకు కొత్త సంవత్సరంలో మెరుగైన సేవలు అందించాలని ఐసీడీఎస్ సీడీపీఓ హేమభార్గవి అన్నారు. మంగళవారం సెక్టార్ సమావేశం నిర్వహించారు. టీచర్లు సమయపాలన పాటించాలని, ఆహారం అందించే విషయంలో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా నాణ్యతతో కూడిన భోజనం అందించాలని సూచించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలపాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. ఆటపాటలతో పిల్లలకు బోధన చేస్తూ వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ముందస్తు నూతన సంవత్సర సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ సంతోష, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment