హ్యాపీ న్యూఇయర్
● 2024కు వీడ్కోలు..2025కు స్వాగతం ● కేక్ కటింగ్‌లు.. విందు, వినోదాల్లోమునిగిన యువత ● మెదక్ కేథడ్రల్‌లో ప్రత్యేక ప్రార్థనలు
మెదక్‌జోన్: న్యూ ఇయర్ సందర్భంగా చర్చిలో మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కు వెల్‌కం పలికారు. కేకులను కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ సీఎస్‌ఐ చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రెసిబెటరీ ఇన్‌చార్జి శాంతయ్య.. ప్రార్థనలు చేసి భక్తులకు దైవసందేశాన్ని ఇచ్చారు. మంగళవారం రాత్రి నుంచే జిల్లాలో యువత విందులు, వినోదాలతో మునిగారు. బేకరీల వద్ద హడావిడి కనిపించింది. అర్ధరాత్రి 12 గంటలు కాగానే హ్యాపీ న్యూఇయర్ అంటూ చిన్నాపెద్ద సందడి చేశారు. యువత కేరింతలతో ఆయా ప్రాంతాలన్నీ పండుగ వాతావరణాన్ని తలపించింది.
Comments
Please login to add a commentAdd a comment