డ్యాం పటిష్టతపై నిపుణుల ఆరా
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టును శుక్రవారం డ్యాం సేఫ్టీ ఇంజినీర్ల బృందం సందర్శించింది. భూగర్భనిపుణుడు ఎం.రాజు, డ్యాం రక్షణ నిపుణుడు విజయ్ ట్రింబక్ దేశాయ్ నేతృత్వంలోని ఇంజినీర్ల బృందం నిశితంగా పరిశీలించింది. జాతీయ డ్యాం సేఫ్టీ కమిటీ సూచనల మేరకు ఈ బృందం ప్రతి రెండేళ్లకోసారి నీటి పారుదల శాఖ ప్రాజెక్టులను పరిశీలించి నివేదికలు సమర్పిస్తుంది. ఉదయం ప్రాజెక్టుకు చేరుకున్న బృందం అణువణువును డ్యాంను పరిశీలించారు. వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి స్థానిక ఇంజినీర్ల నుంచి వివరాలు సేకరించారు. డ్యాం కుడి, ఎడమల మట్టి కట్టను, డ్యాంపై ఉన్న 17 గేట్లను పరిశీలించారు. గేట్లను ఎత్తే వైర్‌రూప్‌లను, మట్టి కట్ట పటిష్టతను, మట్టి కట్టపై నిర్మించిన రాతి కట్టడాలను పరిశీలించారు. గేట్లను ఎత్తడానికి ఉపయోగించి విద్యుత్ మోటార్ల పనితీరుపై ఆరా తీశారు. దిగువ భాగంలో సీపింగ్ వాటర్ పోవడానికి నిర్మించిన గ్యాలరీని పరిశీలించారు.
సేఫ్టీ బృందం నివేదికపైనే..
సింగూరు డ్యాం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 30టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 29 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో అధికారులు డ్యాం రక్షణపై పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. డ్యాం సేప్టీ అధికారుల నివేదికల ప్రకారం మరమ్మతులు చేపడుతారు. గత వేసవిలో సింగూరు ప్రాజెక్టుకు గేట్లను ఎత్తడానికి ఉపయోగించి రూప్‌వైర్లను మార్చి గ్రీజ్ చేయించారు. గేట్లను అమర్చే గ్రూపులలో రబ్బర్లను అమర్చి లీకేజీలను అరికట్టారు. ఈ బృందంలో నీటి పారుదల శాఖ సీఈలు ధర్మా, మోహన్‌కుమార్, ప్రమీల, యేసయ్య ఈఈ బీం, డిప్యూటీ ఈఈ నాగరాజు, ఏఈ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
సింగూరును పరిశీలించిన
సేఫ్టీ బృందం
మట్టి కట్ట, రాతి కట్ట,
సీపింగ్ గ్యాలరీ పరిశీలన
డ్యాం భద్రతపై సంతృప్తి
Comments
Please login to add a commentAdd a comment