గ్రంథాలయాలతో విజ్ఞానం పెంపు
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి
వెల్ధుర్తి(తూప్రాన్)/చిలప్‌చెడ్(నర్సాపూర్)/రామాయంపేట(మెదక్): గ్రంథాలయాలతో విజ్ఞానం పెరగడంతో పాటు మానసికోల్లాసం పెంపొందుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. బుధవారం వెల్ధుర్తిలోని నూతన గ్రంథాలయానికి ఫర్నీచర్ అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రంథాలయానికి అవసరమైన వసతులు, పుస్తకాలను అందజేస్తామని చెప్పా రు. అలాగే పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. ప్రహరీతో పాటు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఆమె వెంట జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిలప్‌చెడ్‌లో పర్యటించారు. త్వరలోనే గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రంథాలయ ఏర్పాటుకు భవనాన్ని పరిశీలించారు. అలాగే రామాయంపేట శాఖా గ్రంథాలయాన్ని సందర్శించి మాట్లాడారు. జిల్లాస్థాయిలో మొత్తం 16 మండలాల్లో లైబ్రరీలు ఉండగా, మిగితా మండలాల్లో ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉందని, త్వరలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment