జాబితాలో పేరు లేదనిఆందోళన వద్దు
నర్సాపూర్: జాబితాలో పేర్లు లేని వ్యక్తులు ఆందోళన చెందవద్దని, అలాంటి వారి నుంచి దరఖా స్తులు తీసుకొని విచారణ చేపడతామని కలెక్టర్ రాహుల్‌రాజ్ స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని ఆరవ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు సభలో పాల్గొని మాట్లాడారు. అర్హత ఉన్న వారిని లబ్ధిదారుల జాబితాలో చేరుస్తామని వివరించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయి మోద్దీన్, కమిషనర్ రామకృష్ణరావు, ఆర్‌ఐ ఫైజల్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేదని స్థానికురాలు మమత నాయకులతో తన గోడు వివరిస్తూ కంటతడి పెట్టింది.
వైద్యుల పనితీరు భేష్
నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు బాగా పని చేస్తున్నారని కలెక్టర్ అభినందించారు. బుధవారం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వార్డులలో పర్యటించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు, మందులపై గురించి ఆరా తీశారు. అనంతరం రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. ఆస్పత్రిలో ఎలాంటి లోటుపాట్లు లేవని రోగులు చెప్పినట్లు ఆయన వివరించారు. ఇష్టానుసారంగా వార్డులలోకి రాకుండా కట్టడి చేయాలని, విజిటింగ్ టైంలోనే వచ్చి తమ వారిని చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయనతో పాటు సూపరింటెండెంట్ పావని, ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment