అనుకున్నంత అభివృద్ధి చేయలేకపోయా
రామాయంపేట(మెదక్): ఈ ఐదేళ్ల కాలంలో అనుకున్నంత మేర అబివృద్ధి సాధించలేకపోయామని మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన మున్సిపల్ చివరి సమావేశం అనంతరం కౌన్సిలర్లు నాగరాజు, అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లా డారు. తాము ఎన్నో ఆశలతో పదవిని అలంకరించామని, అభివృద్ధి పనులు చేయనందుకు ప్రజలు క్షమించాలని కోరారు. కరోనాతో పాటు నిధుల మంజూరు కాకపోవడం అభివృద్ధికి అడ్డంకిగా మా రిందని వాపోయారు. 2020లో జనవరిలో ప్రమాణస్వీకారం చేయగా, తర్వాత రెండు నెలలకే కరోనాతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. 2023లో పలు పథకాల కింద రూ. 10 కోట్ల మేర నిధులు మంజూరు కాగా, రూ. ఆరున్నర కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడితే ఇప్పటివరకు డబ్బులు రాలేదని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అభివృద్ధి పనులకు సంబంధించి వేర్వేరు పథకాల కింద రూ. 50 కోట్లు మంజూరు కాగా, నిధులు మళ్లిపోయాయని పేర్కొ న్నారు. గత ప్రభుత్వ హయాంలో రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ మంజూరు కాగా, ఇంతవరకు గెజిట్ విడుదల కాలేదని వాపోయారు. తాము అధికారంలో లేకపోయినా అభివృద్ధికి సహకరిస్తామన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు, ఎంపీ రఘునందన్‌రావు మున్సిపాలిటీ అభివృద్ధి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు కొండల్‌రెడ్డి, యాదగిరి, అహ్మద్ పాల్గొన్నారు.
ప్రజలు క్షమించాలి
రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment