అర్హులందరికీ సంక్షేమ పథకాలు
పాపన్నపేట(మెదక్): అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరు అవుతాయని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం మండలంలోని ఎల్లాపూర్‌లో జరిగిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా తదితర పథకాల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. గ్రామ సభలో వెల్లడించిన తర్వాతనే అర్హులను ఎంపిక చేస్తారని చెప్పారు. సభ లో పేర్లు చదివిన తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని కోరారు. సాగుకు యోగ్యమైన భూ ములను పక్కాగా గుర్తించామని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించామన్నారు. ఏమైన అనుమానాలుంటే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆరు గ్యారంటీల పథకం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విష్ణువర్ధన్, జి ల్లా కాంగ్రెస్ కిసాన్‌సెల్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్
Comments
Please login to add a commentAdd a comment