చట్టాలపై అవగాహన అవసరం
కౌడిపల్లి(నర్సాపూర్): చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ అన్నారు. బుధవారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో– బేటి పడావో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలు కల్పించిందన్నారు. ప్రస్తుతం చిన్న పిల్లలు, మహిళపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆడ పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరిబాబు, ఐసీడీఎస్ నర్సాపూర్ ప్రాజెక్ట్ సీడీపీఓ హేమభార్గవి, హెచ్‌డబ్ల్యూఓ శివరామకృష్ణ, జిల్లా కోఆర్డినేటర్ సంతోషి, కవిత, శ్రీనివాస్‌గౌడ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్
Comments
Please login to add a commentAdd a comment