బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు ఈ ఏడాది ప్రారంభంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అమీర్‌ఖాన్ మూడో పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమీర్‌ఖాన్, కరీనా కపూర్‌తో కలిసి నటిస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రం విడుదలయ్యాక తన మూడో వివాహానికి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తారని బీటౌన్‌లో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో.. ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని ఆమిర్ సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ తన సినిమాల్లో బిజీగా ఉన్నాడని తెలిపారు. కాగా, అమీర్‌ఖాన్, కిరణ్‌రావుల మధ్య విభేదాలకు.. ఫాతిమా సనా షేక్ కారణమని కూడా సోషల్‌మీడియాలో వార్తలోచ్చాయి. తాజాగా, దీనిపై ఫాతిమా సనా షేక్ టీవీ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు.
‘కొందరు వ్యక్తులు.. ఆమిర్ ఖాన్, తాను డేటింగ్‌లో ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నెటిజన్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఫాతిమాసనా స్పష్టం చేసింది’. కాగా, అమీర్‌ఖాన్ తన మొదటి భార్య రీనాదత్తాకు 2002లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత.. లగాన్ సెట్స్‌లో కిరణ్‌రావుతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి.. వీరు 2005లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఆజాద్ రావ్ ఖాన్ కొడుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment