Director Ritesh Rana About Happy Birthday Movie: ‘‘సీరియల్ కామెడీ అనే జానర్ ఉంది. కానీ ఆ తరహా జానర్‌లో ఇప్పటివరకు తెలుగులో సినిమాలు రాలేదు. ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అవుతారని ఆ జానర్‌లో ‘హ్యాపీ బర్త్ డే’ తీశాం. కథ లాజికల్‌గానే ఉంటుంది. కానీ కథ జరిగే ప్రపంచం ఊహాజనితంగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు రితేష్ రానా. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రధారిగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు రితేష్ రానా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి పాత్ర పేరు హ్యాపీ. కథలో రిచ్‌గ్రాండ్ అనే హోటల్‌లో హ్యాపీ పుట్టినరోజున జరిగే కొన్ని అంశాల నేపథ్యంలో సినిమా కథనం ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ‘హ్యాపీ బర్త్ డే’ టైటిల్ పెట్టాం. కథ చాప్టర్ వైజ్‌గా వెళ్తుంటుంది. కామెడీలో ఉన్న జానర్స్‌ను ఒక్కో చాప్టర్‌లో టచ్ చేశాం. సినిమాలో ఏడు చాప్టర్లు ఉంటాయి. స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ అండ్ టిపికల్‌గా ఉన్నా ఆడియన్స్ మాత్రం కన్‌ఫ్యూజ్ అవ్వరు. లావణ్య బయట చాలా జోవియల్‌గా ఉంటారు. ఇదే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం. థియేటర్స్‌లో నవ్వుతూ సినిమాను ఎంజాయ్ చేయడంలో ఉన్న కిక్ డిఫరెంట్. నా నెక్ట్స్ సినిమా కూడా మైత్రీ మూవీ మేకర్స్‌తోనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
చదవండి:👇
హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత..
బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్
వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..!
కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి
కమల్ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ?
Comments
Please login to add a commentAdd a comment