‘రౌడీ బాయ్స్‌’కు ఎన్టీఆర్‌ సాయం.. ట్రైలర్‌ అదిరిందిగా! | Jr NTR Launched Rowdy Boys Movie Trailer | Sakshi
Sakshi News home page

Rowdy Boys Trailer: ప్రేమదేశం గుర్తొచ్చింది: ఎన్టీఆర్‌

Jan 9 2022 8:24 AM | Updated on Jan 9 2022 8:26 AM

Jr NTR Launched Rowdy Boys Movie Trailer - Sakshi

మన తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తారనే నమ్మకం ఉంది

‘‘రౌడీ బాయ్స్‌’ సినిమా ట్రైలర్‌ చూస్తే ‘ప్రేమదేశం’ చిత్రం చూసిన ఎగ్జయిట్‌మెంట్‌ వచ్చింది. అందరికీ అలాంటి ఎగ్జయిట్‌మెంట్‌ కలుగుతుందని నమ్ముతున్నాను’’ అని హీరో ఎన్టీఆర్‌ అన్నారు. ఆశిష్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. అనిత సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని ఎన్టీఆర్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆది’ సమయంలో ‘దిల్‌’ రాజు,  శిరీష్‌గార్లతో పరిచయం ఏర్పడింది. శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయం అవుతున్న ‘రౌడీ బాయ్స్‌’ ట్రైలర్‌ను నేను రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉంది.

ఈ సినిమా ఘనవిజయం సాధించి, మంచి చిత్రంగా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను. మన తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ మాట్లాడుతూ– ‘‘యూత్‌ సహా అన్ని వర్గాలకు నచ్చే ఎంటర్‌టైనర్‌ ‘రౌడీ బాయ్స్‌’. సంక్రాంతికి విడుదలవుతున్న మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది’’  అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement