బాలీవుడ్ సినిమాలు తోపు.. అది ఒకప్పుటి మాట.. నెమ్మదిగా సౌత్ సినిమాలు హిందీలోనూ భారీ కలెక్షన్లు రాబడుతూ సత్తా చాటుతున్నాయి. దక్షిణాది చిత్రాలను హిందీ ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. కానీ బాలీవుడ్ మూవీస్‌ను మాత్రం మనవాళ్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే విషయాన్ని ఆ మధ్య బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ సైతం ప్రస్తావించాడు. సౌత్ సినిమాలు బాలీవుడ్‌లో బాగా ఆడుతున్నాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం అక్కడ ఎందుకు వర్కవుట్ అవడం లేదో? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
తాజాగా ఆయన ప్రశ్నకు కేజీఎఫ్ హీరో యశ్ సరైన సమాధానమిచ్చాడు. 'సల్మాన్ ఖాన్ అభిప్రాయం తప్పు. చాలాకాలంగా ఇక్కడి సినిమాలను హిందీలో డబ్ చేసి వదులుతున్నారు. దీంతో రానురానూ సౌత్ కంటెంట్ హిందీ ప్రేక్షకులకు చేరువైంది. మొదట్లో ఇదో జోక్‌గా ప్రారంభమైనా ఆడియన్స్ ఇది ఏ ప్రాంతానికి చెందిన సినిమా అని పెద్దగా పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా ఇది కొనసాగుతూ ఉండటంతో వారు ఇక్కడి పద్ధతులను అర్థం చేసుకున్నారు. అది మాకిప్పుడు ఉపయోగపడింది. రాజమౌళి బాహుబలిని డైరెక్ట్‌గా రిలీజ్ చేశారు. కేజీఎఫ్ విషయంలో మేమూ అదే ఫాలో అయ్యాం. అది మా బిజినెస్‌కు ఉపయోగపడింది' అని చెప్పుకొచ్చాడు. హిందీ సినిమాలు రిలీజ్ చేసి పనైపోయిందనుకుంటున్నారని, కానీ ప్రమోషన్ కూడా చేసినప్పుడే అది జనాల్లోకి వెళుతుందని పేర్కొన్నాడు యశ్. కాగా యశ్ నటించిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న రిలీజవుతోంది.
చదవండి: మందు తాగుతా, ఆ టైమ్‌లోనే కథలు రాస్తాను: ప్రశాంత్ నీల్
Comments
Please login to add a commentAdd a comment