Manchu Manoj Shares Interesting Post On Instagram - Sakshi
Sakshi News home page

Manchu Manoj: అలా చూస్తూ ఉండటం కన్నా చావడం నయం.. నువ్వూ బతుకు, ఇతరుల్ని కూడా బతకనివ్వు!

Published Sat, Mar 25 2023 1:59 PM | Last Updated on Sat, Mar 25 2023 2:49 PM

Manchu Manoj Shares Interesting Post On Social Media, Live and Let Live - Sakshi

మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం నడుస్తోంది. విష్ణు తన మనుషులను కొడుతున్నాడంటూ మనోజ్‌ సోషల్‌ మీడియాలో వీడియో షేర్‌ చేయడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. ఇవి అన్నదమ్ముల మధ్య ఉండే చిన్నచిన్న తగాదాలే అని విష్ణు వివాదంపై స్పందించాడు. మరోవైపు అన్నదమ్ములిద్దరూ సహనం పాటించాలంటూ వీడియో డిలీట్‌ చేయించాడు మోహన్‌బాబు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్న విషయం వాస్తవమేనని సోషల్‌ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో మనోజ్‌ నెట్టింట ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేశాడు. 'కళ్ల ముందు జరుగుతున్న తప్పులను చూసీచూడనట్లు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధమే' అని ఓ కోట్‌ షేర్‌ చేశాడు. 'క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు' అని మరో కోట్‌ సైతం పంచుకున్నాడు. మీరు బతకండి, ఇతరులను కూడా బతకనివ్వండి అంటూ దండం పెడుతున్న ఎమోజీని క్యాప్షన్‌లో జోడించాడు. ఈ పోస్ట్‌ చూసిన అభిమానులు.. ఏమైంది? విష్ణు అన్న ఏమైనా అన్నాడా? కుటుంబం ఎంతో ముఖ్యమైనది అన్నా.. మీ గొడవలు సద్దుమణగాలని కోరుకుంటున్నా, నువ్వేంటో మాకు తెలుసు, ఎప్పుడూ నీకు సపోర్ట్‌గా ఉంటాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement