మాస్ మహారాజ రవితేజ- శరత్ మందవ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఎల్ ఎల్ పి బ్యానర్లో సుధాకర్ చేకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా వాయిదా పడ్డ పెద్ద సినిమాలు, పాన్ ఇండియా చిత్రాలు వరస పెట్టి రిలీజ్ డేట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి నుంచి జూన్ వరకు పెద్ద సినిమాల హావానే కొనసాగనుంది.
చదవండి: మెగా ఫ్యాన్స్‌కు షాక్, అది ఫేక్ అట!
ఈ క్రమంలో చిన్న సినిమాలకు రిలీజ్ డేట్ దొరకడం లేదు. మీడియం బడ్జెట్ సినిమాలకు సైతం ఇదే సమస్య వచ్చింది పడింది. అందులో మాస్ మహారాజా రామారావు ఆన్ డ్యూటీ కూడా ఉండటం ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తోంది. ఇటీవల ‘ఖిలాడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ ఈ మూవీని పెద్ద అలరించలేకపోయాడు. డిస్ట్రిబ్యూట్లకు కూడా ఖిలాడీ భారీ నష్టాలనే తీసుకొచ్చిందని సమాచారం. దీంతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీపైనే రవితేజ ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఇప్పడు ఈ మూవీ బిజినెస్‌పై భారీ ప్రభావం పడేలా కనిపిస్తోంది. అయితే మొదట మార్చి 25న ఈ మూవీని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నారు. అప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల చేస్తున్నట్లు జక్కన్న ప్రకటించడంతో ఈ సినిమా వాయిదా పడింది.
చదవండి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ
ఆ తర్వాత ఏప్రీల్ 15న విడుదల చేయాలనుకుంటే.. అప్పుడు కూడా పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. కేజియఫ్ 2తో పాటు విజయ్ బీస్ట్ సినిమాలు ఏప్రీల్ 14న విడుదల కానున్నాయి. అందుకే రామారావు ఆన్ డ్యూటీని మళ్లీ వాయిదా వేయాలని అనుకుంటున్నారట దర్శక-నిర్మాతలు. ఈ నేపథ్యంలో రామారావు ఆన్ డ్యూటీని ఇప్పుడు నేరుగా ఓటిటిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైందిప్పుడు. సోనీ లివ్‌లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాను నేరుగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మంచి రేట్ రావడంతో సినిమాను అక్కడ ఇచ్చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. జూన్ వరకు సరైన డేట్స్ లేకపోవడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment